Tractor | అనుభ‌వం లేని వ్య‌క్తి డ్రైవింగ్ చేయ‌టం వ‌ల్ల‌నే…

Tractor | అనుభ‌వం లేని వ్య‌క్తి డ్రైవింగ్ చేయ‌టం వ‌ల్ల‌నే…

Tractor | వత్సవాయి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గ్రామ శివారులో సుబాబుల్ కర్ర లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాక్ బోల్తా కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం సుబాబుల్ కర్ర లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలోనికి దూసుకు వెళ్లిన ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ట్రాక్టర్ పై ఉన్న వ్యక్తి పై సుబాబుల్ కర్ర మీదపడి ఊపిరి అందక అక్కడిక‌క్కడే యువకుడు మృతి చెందాడు.

యువకుని మీద పడిన సుబాబుల్ కర్రను తొలగించిన సమీపంలోని వ్యక్తులు అప్పటికే వ్యక్తి మృతి చెందాడు అని నిర్ధారించారు. అనుభవం లేని వ్యక్తి డ్రైవింగ్ చేయటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply