టిట్కో గృహ సముదాయాలను ప‌రిశీల‌న‌…

టిట్కో గృహ సముదాయాలను ప‌రిశీల‌న‌…

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం
టిట్కో గృహాలను జూన్ నెలలోపు అందిస్తాం
ఫేస్ వన్ లో 1480 ఇళ్ల పంపిణీ
ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
చైర్మన్ రాఘవేంద్ర

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులతో కలసి టిట్కో గృహాల సముదాయాలను పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ జగ్గయ్యపేట లో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రారంభించిన గృహాల సముదాయాన్ని ఫేస్ వన్ లో భాగంగా జూన్ నెలలోపు 1వెయ్యి 480 గృహాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

2014 ,19 మధ్యకాలంలో దాదాపు టిట్కో గృహాల నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం గత ప్రభుత్వం ఈ గృహాల నిర్మాణ పనులకు సంబంధించి పట్టించుకోవడంతో పేదల ఇండ్ల నిర్మాణ పనులు పురోగతి లేదని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో అధునాతన టెక్నాలజీతో పేదలందరికీ సొంతింటి కల గృహాల పంపిణీ చేయాలని భావించి ప్రారంభించిన గృహాల సముదాయాలును పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు.

3,180 గృహాలను వీలైనంత తొందరగా నిర్మాణాలను పూర్తి చేయటానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాట్లాడుతూ ఈ గృహాల సముదాయంలో కాలనీలు పార్కులు కమ్యూనిటీ హాల్స్ వంటి వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తులసి వెంకటకృష్ణారావు, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు మున్సిపల్ కౌన్సిలర్ కన్నేబోయిన రామలక్ష్మి, కౌన్సిలర్లు గించుపల్లి వెంకటరావు సంగ్యపు బుజ్జిబాబు నాయకులు కర్ల జ్యోతి ,గుమ్మా వెంకటేష్, గృహ నిర్మాణ ఇంజనీర్లు, మున్సిపల్ అధికారులు సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.