అభివృద్ధికి అండగా ఉంటా

అభివృద్ధికి అండగా ఉంటా

  • ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఆంధ్రప్రభ : నూతనంగా ఎన్నుకోబడిన మంథని మున్సిపాలిటీ పాలకవర్గం సభ్యులు తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా హైదరాబాదులో కలిశారు. మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు కలిసి మంత్రి శ్రీధర్ బాబును ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

మంథని ప్రజలు ఎంతో ఆశగా ఆశీర్వదించారని, వారికి బాధ్యతాయుతమైన పరిపాలన అందించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. మంథని మున్సిపాలిటీ అభివృద్ధికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. వార్డు కౌన్సిలర్లు వార్డు సందర్శన కార్యక్రమం ద్వారా ప్రజల బాగోగులు తెలుసుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి వార్డులో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. అవసరమైన నిధుల మంజూరుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు.

అధికారం వచ్చిన తర్వాత అత్యంత బాధ్యతాయుతంగా పరిపాలన అందించాలని మంత్రి పేర్కొన్నారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని నూతన పాలకవర్గానికి మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ పాలకవర్గ సభ్యులు కుర్ర లింగయ్య, నూకల కమల్, మద్దికట్ల స్రవంతి రమేష్ బాబు, జంబోజు శ్రీమతి సమ్మయ్య, లైశెట్టి రజిత రాజు, మారుపాక నిహారిక నాగరాజు, పెంటరి రాజేందర్, వేముల లక్ష్మీ సమ్మయ్య, ఎల్లంకి వంశీధర్, తదితరులు ఉన్నారు.

Leave a Reply