Leader to Cadre | మై టీడీపీ యాప్ డౌన్లోడ్ ప్లీజ్‌…

Leader to Cadre | మై టీడీపీ యాప్ డౌన్లోడ్ ప్లీజ్‌…

  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

Leader to Cadre | విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరరూ మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపునిచ్చారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో స్టేట్ టు బూత్, ప్రతి సమాచారం, లీడర్ టు క్యాడర్” పోస్టర్‌ను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆలోచనలతో ప్రతి టీడీపీ కార్యకర్తకు ఉపయోగపడేలా ఈ యాప్ రూపొందించినట్టు చెప్పారు.

కూటమి ప్రభుత్వ పథకాలు, పనులకు సంబంధించిన వివరాలు మొత్తం ఇందులోనే తెలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి నుంచి బూత్ స్థాయి సమాచారం వరకూ ఇందులో అందుబాటులో ఉంటుందన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సంభందించిన తాజా వార్తలు, సమగ్ర సమాచారంతో మై టీడీపీ యాప్ మీ ముందుకు వచ్చిందన్నారు. పార్టీకి సంబంధించి ప్రతి అప్డేట్‌ను ఇందులో మీరు పొందవచ్చు. అలాగే మీకు సంబంధించిన గ్రీవెన్స్‌ను ఈ యాప్ ద్వారా తెలియజేయవచ్చు.

Leader to Cadre |

పార్టీ కొరకు మీరు చేసే ప్రతి పని, సోషల్ మీడియా ద్వారా గ్రౌండ్‌ లెవెల్‌లో మీ యాక్టివిటీస్ అన్ని ఈ యాప్ ద్వారా అధిష్టానానికి తెలుస్తుంది. కావున ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం పార్టీ మద్దతు దారులు అందరూ కింద ఇచ్చిన లింక్ ద్వారా మై టీడీపీ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామ, మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ఈ పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. కుటుంబ సాధికార సారథులు, బూత్ కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ ఇంచార్జిలు, క్లస్టర్ ఇంఛార్జిలు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు ఈ యాప్ ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొనగలరు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply