Distribution | చిన్నారుల అనారోగ్యానికి అడ్డుకట్ట వేద్దాం….

Distribution | చిన్నారుల అనారోగ్యానికి అడ్డుకట్ట వేద్దాం….
- నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్ర సురక్షిత మార్గం..
- చిన్నారులు, కిశోర బాలలు అల్బెండజోల్ మాత్ర తప్పనిసరిగా తీసుకోవాలి..
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ…
Distribution | విజయవాడ, ఆంధ్రప్రభ : చిన్నారులు, కిశోర బాలల్లో రక్తహీనత, పోషకాల లోపాలకు కారణమైన నులి పురుగుల నివారించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు అల్బెండజోల్ మాత్ర ఎంతో ఉపయోగపడుతుందని, విద్యార్థులకు పంపిణీ చేసిన అల్బెండజోల్ మాత్రను తప్పనిసరిగా వినియోగించేలా పూర్తి పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య, విద్యాశాఖల ఆధ్వర్యంలో స్థానిక సివిఆర్ హైస్కూల్లో నిర్వహించిన నులిపురుగుల మాత్రల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్ని విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యంపై నులి పురుగులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. చిన్నారుల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీసే నులి పురుగులను నివారించేందుకు అల్బెండజోల్ మాత్ర సురక్షితమైన మార్గం అన్నారు. విద్యార్థుల విద్య మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపే నులి పురుగులను కేవలం ఒకే అల్బెండజోల్ మాత్రతో నివారించ వచ్చనన్నారు.

విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించి అల్బెండజోల్ మాత్రను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అల్బెండజోల్ మాత్రను చిన్నారులు తప్పనిసరిగా వినియోగించడం ద్వారా పోషకాల లోపం, అలసట, బలహీనత వంటి సమస్యలను నివారించవచ్చున్నారు. ఒక ఏడాది నిండిన పిల్లల నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి చిన్నారి తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని సూచించారు. పంపిణీ చేసిన అల్బెండజోల్ మాత్రలు చిన్నారులు వినియోగించేలా ఉపాధ్యయులు బోదనేతర సిబ్బంది తల్లిదండ్రులు పూర్తి పర్యవేక్షణ చేయవలసి ఉందన్నారు.

వివిధ కారణాల వల్ల మాత్ర తీసుకోని చిన్నారుల కొరకు ఈ నెల 24వ తేదీన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాత్రలను పంపిణీ చేసేందకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దినచర్యలలో పరిశుభ్రమైన నీటిని తాగడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరచుకోవడం వంటి ఆరోగ్య సూత్రాలను పాటించి నులిపురుగుల ఉత్పత్తిని నివారించుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. ఎం సుహాసిని అల్బెండజోల్ మాత్రల ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరిస్తూ ఏడాదికి రెండుసార్లు పిల్లలు, కిశోర బాలలకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

పీహెచ్సీలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలలో నులి పురుగుల నిర్మూలన పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ తదితర విద్యా సంస్థలలో విద్యార్థులకు నులి పురుగుల మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు తల్లిదండ్రులపై ఉందని డిఎం & హెచ్ ఓ సుహాసిని అన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారిణీ ఎల్. చంద్రకళ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో 916 ప్రభుత్వ పాఠశాలలు 508 ప్రైవేటు పాఠశాలలు 29 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 94 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 15 ప్రైవేట్ సాంకేతిక విద్యా సంస్థలు 32 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు 12 ఇంజనీరింగ్ కళాశాలలు 1475 అంగన్వాడీ కేంద్రాలు ఇతర విద్యా సంస్థలతో కలిపి 3,125 విద్యా సంస్థల ద్వారా 5 లక్షల 6 వేల 200 మంది చిన్నారులకు అల్పెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు చంద్రకళ తెలిపారు.
కార్యక్రమంలో సీనియార్ మెడికల్ ఆఫీసర్ ఎస్ ఎస్. ఎ. యు డా. ఎం ఉషారాణి, జిల్లా విద్యా శాఖ అధికారిణి ఎల్. చంద్రకళ, సివిఆర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ సిహెచ్ ఐ. సుబ్రహ్మణ్యం, ఆర్బీఎస్కి ప్రోగ్రామ్ అధికారి డా. మాధవి, లబ్బీపేట యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డా. భార్గవి, ప్రోగ్రాం కన్సెల్టెంట్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
click here to read more : School | గురుకులాల్లో ప్రవేశాలు…!!
పీహెచ్సీలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలలో నులి పురుగుల నిర్మూలన పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ తదితర విద్యా సంస్థలలో విద్యార్థులకు నులి పురుగుల మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు తల్లిదండ్రులపై ఉందని డిఎం & హెచ్ ఓ సుహాసిని అన్నారు. జిల్లా విద్యా శాఖ అధికాల 200 మంది చిన్నారులకు అల్పెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు చంద్రకళ తెలిపారు.