Telugu cinema l ఆ ముగ్గురులో విజేత ఎవరు…?

Telugu cinema l ఆ ముగ్గురులో విజేత ఎవరు…?

Telugu cinema l బ్రిటిష్ కాలం కథలతో కొత్త ట్రెండ్
విజయ్ దేవరకొండ ‘రణబలి’లో యోధుడిగా
ప్రభాస్ ‘ఫౌజీ’లో ఆజాద్ హింద్ ఫౌజ్ స్పూర్తి
నిఖిల్ ‘ది ఇండియా హౌస్’లో ఫ్రీడమ్ ఫైటర్ కథ
ముగ్గురిలో విజేత ఎవరు? ఆసక్తిగా మారిన పోటీ

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఒకసారి లవ్ స్టోరీస్ ట్రెండ్ గా మారితే.. ఒక్కోసారి యాక్షన్ సినిమాలు ట్రెండ్ నడుస్తుంటుంది. అలాగే భక్తిరస చిత్రాల ట్రెండ్ కూడా నడుస్తుంటుంది. అలాగే స్పై చిత్రాల ట్రెండ్ కూడా గతంలో నడిచింది. ఇప్పుడు రామాయణం, మహా భారతాలను లింక్ చేస్తూ పాన్ ఇండియా సినిమాలు చేయడం అనే ట్రెండ్ నడుస్తుంది. ఈ ట్రెండ్ తో పాటు కొత్తగా బ్రిటిష్ కాలం కథల జోరు కూడా ఊపందుకుంటోంది. ఇప్పుడు మూడు సినిమాలు ఈ తరహా కాన్సెప్ట్ తో రాబోతున్నాయి. ఇంతకీ.. ఆ మూడు సినిమాలు ఏంటి..? విజేతగా నిలిచేది ఎవరు..?

Telugu cinema l విజయ్ దేవరకొండ రణబాలి..

Telugu cinema

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మూవీ రణబాలి. ఈ మూవీని రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్, వీడియో గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ యోధుడుగా నటిస్తున్నాడు. కథ రాయలసీమ ప్రాంతంలో 1947 టైమ్ లో జరుగుతుంది. ఇందులో బ్రిటీష్ దురాగతాలు, ఒక యోధుడి ఎలా ఎదుర్కొన్నాడు అనేది చూపిస్తున్నట్టుగా గ్లింప్స్ ను బట్టి తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే.. చరిత్రలో మరుగునపడిన ఒక యోధుడి కథగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీని పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Telugu cinema l ప్రభాస్ ఫౌజీ..

Telugu cinema

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ ఫౌజీ. దీనికి హను రాఘవపూడి డైరెక్టర్. ఈ భారీ, క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఆగష్టులో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది కానీ.. అక్టోబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా కథ కూడా 1940 కాలంలో సాగుతుంది. ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సృష్టించిన సైన్యంలో ఒక సైనికుడిగా ఉండి, ఆ స్పూర్తితో ఇక్కడ రజాకార్ల పై తిరుగుబాటు చేసిన హీరోగా ప్రభాస్ కనిపిస్తాడని సమాచారం.

Telugu cinema l నిఖిల్.. ది ఇండియా హౌస్..

Telugu cinema

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న భారీ చిత్రం ది ఇండియా హౌస్. కూడా బ్రిటిష్ కాలం నాటి కథే. బ్రిటిష్ వాళ్ళ వైపే పోరాడుతూ వాళ్ళకే డిచ్ కొట్టిన ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ కథ ఇది. నిఖిల్ సిద్ధార్థ్ ఇందులో బ్రిటిష్ గూఢచారిగా కనిపిస్తాడు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్ వంశీ కృష్ణ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని రామ్ చరణ్ సమర్పిస్తుండడం విశేషం. ఇది కూడా బ్రిటీష్ కాలం నాటి కథతోనే రూపొందుతోంది. ఇలా విజయ్ దేవరకొండ, ప్రభాస్, నిఖిల్.. బ్రిటీష్ కాలం నాటి కథతో సినిమాలు చేస్తుండడం విశేషం. ఈ మూడు చిత్రాల పై అంచనాలు ఉన్నాయి. మరి.. ఈ ముగ్గురులో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే.

CLICK HERE TO READ అసలు ప్లాన్ ఇదే..

CLICK HERE TO READ MORE

Leave a Reply