Mandali | దేవస్థాన ఖ్యాతి ఇనుమడించేలా అభివృద్ధి చేయండి..

Mandali | దేవస్థాన ఖ్యాతి ఇనుమడించేలా అభివృద్ధి చేయండి..

Mandali, అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ప్రతి ఏటా వేలాది భక్తులు దర్శించుకోవటంతో పాటు పలువురు ప్రముఖులకు ఆరాధ్య పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ అద్దంకి నాంచారమ్మ దేవస్థాన ఖ్యాతి ఇనుమడించేలా అభివృద్ధి చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కోడూరు మండలం విశ్వనాథపల్లి శ్రీ అద్దంకి నాంచారమ్మ జాతర మహోత్సవాల పోస్టర్లను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ తోట వెంకట సూర్య నరసింహారావు, ఆలయ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, యువ నాయకులు మండలి వెంకట్రామ్ లను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఉత్సవాల పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ జాతర ఉత్సవాలు ఈనెల 18 నుంచి 15 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు, వి.కొత్తపాలెం, విశ్వనాధపల్లి కుమ్మరిపాలెం గ్రామాలలో చిన్న అమ్మవారు ఇంటింటికి వెళ్లి పూజలు అందుకుంటుందని ఎమ్మెల్యేకు వివరించారు. మార్చి 02, 03 తేదీలలో ఆలయ ప్రధాన జాతర జరుగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా జాతరకు వచ్చు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే పాలకవర్గ సభ్యులకు సూచించారు. దేవస్థానం అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దన్నారు. అవనిగడ్డలో రెండు దేవాలయాలను నూతన పాలకవర్గాలు ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి చేస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల పార్థసారధి, పాలకవర్గ సభ్యులు తోట సోమశేఖరరావు, పులిగడ్డ సముద్రవేణి, ధూళిపూడి రమాదేవి, సనకా రజని, రామాని మల్లికార్జునరావు, టీసీ చైర్మన్ రేపల్లె రవీంద్ర, నాయకులు చెరుకూరి నాగరాజు, ధూళిపూడి వీరాంజనేయులు, చెరుకూరి శ్రీనివాసరావు, రికార్డ్ అసిస్టెంట్ చిట్టిప్రోలు శివప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply