Minister | మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధుల ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌…

Minister | మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధుల ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌…

Minister | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి సవితమ్మ బహూకరించిన ప్రసిద్ధ ముద్దిరెడ్డిపల్లి చేనేత చీరలు మహిళా ప్రజా ప్రతినిధుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయం, స్థానిక కళాకారుల నైపుణ్యం ప్రతిబింబించే ఈ చీరలు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేక చర్చకు దారి తీసాయి. చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తూ, స్థానిక వృత్తిదారులకు మద్దతుగా మంత్రి సవితమ్మ చేసిన ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.

ఈ సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ఇతర సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వారి ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గ సమస్యలు, కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రజా ప్రతినిధులు తెలిపారు. అనంతరం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా రూపొందించిన బడ్జెట్ ప్రజల ఆశలను నెరవేర్చేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తంగా చేనేత చీరల ద్వారా సాంప్రదాయాన్ని ప్రోత్సహించడం, అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరస్పర సమావేశాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మహిళా ప్రజా ప్రతినిధులు చేనేత చీరలతో కనిపించడం సభలో ప్రత్యేకంగా నిలిచింది.

click here to read more : AP | భక్తుల దర్శనానికి విస్తృత ఏర్పాట్లు…

click here to read more :

Leave a Reply