Municipal 2026 | అవును… వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు…

Municipal 2026 | అవును… వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు…
Municipal 2026 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. మున్సిపల్ పీఠాల కైవసానికి కాంగ్రెస్ అప్పుడే బేరసారాలు, కొనుగోళ్లు మొదలుపెట్టిందన్నారు.
తాము దాదాపు 30శాతం మున్సిపాలిటీలు గెలుస్తామని అంచనా వేశామన్నారు. ఓవరాల్‌గా బీఆర్‌ఎస్ మంచి ఫలితాలే సాధించిందని భావిస్తున్నామన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ అధికారం అడ్డుపెట్టుకొని విజయం సాధించిందని ఆరోపించారు. కాంగ్రెస్, భాజపా ఒక్కటయ్యాయని అన్నారు.
మున్సిపాలిటీల్లో మా వాళ్లు చాలాచోట్ల వీరోచిత పోరాటం చేశారన్నారు. చౌటుప్పల్, గద్వాలలో అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమంగా గెలిచారని ఆయన ఆరోపించారు. గద్వాలలో నాలుగుసార్లు రీకౌంటింగ్ చేసి ఒక్క ఓటుతో గెలిచామని చెప్పుకున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీని నిలువరించే పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. పలుచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులను ఎత్తుకెళ్లారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నే అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇదే ఊపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని తెలిపారు. 15 చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించనున్నామని తెలిపారు. కొత్తగూడెంలో సీపీఐ అధిక్యంలో ఉందని, వారికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షపార్టీగా గణనీయమైన విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ పనితీరును ప్రజలు వ్యతిరేకించారని ఆయన తెలిపారు.
