లక్షేట్టిపేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

లక్షేట్టిపేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

  • 1 వ వార్డ్ గెలుపుతో బీజేపీకి పునాది
  • 18 ఓట్ల తేడా తో వైస్ చైర్మన్ అభ్యర్థి ఓటమి
  • 3 ఓట్ల తేడాతో మెట్టు కళ్యాణి రాజు ఓటమి
  • గెలిచే గుర్రాలకు గండికొట్టిన రెబల్స్, బీజేపీ.

లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో లక్షేట్టిపేట మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారు.శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీ తో దూసుకెళ్లారు. మున్సిపాలిటీ లో మొత్తం 15 వార్డులుండగా 11 కాంగ్రెస్, 3 బీ ఆర్ ఎస్, 1 బీజేపీ గెలుపొందాయి. మొదటిసారి బీజేపీ తన ఖాతాను 1 వ వార్డ్ లో ఓపెన్ చేసింది. యువకుడు సిద్ధార్థ (బిట్టు ) బీజేపీ నుంచి గెలుపొంది బీజేపీ సీనియర్ నాయకులు అని చెప్పుకునే వారికే కాకుండా, కష్టపడితే ఫలితం వస్తుందని బీజేపీ పార్టీకి కూడా దిశ నిర్దేశం చేశాడు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ రెండవ వార్డ్ చైర్మన్ అభ్యర్థిని దొంత అంజలి భారీ మెజారిటీతో సమీప బీజేపీ అభ్యర్థి గోల్కొండ భూలక్ష్మిపై గెలుపొందారు.

3 వ వార్డ్ వైస్ చైర్మన్ అభ్యర్థి చల్లా నాగభూషణం 18 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి పెట్టెం తిరుపతి చేతిలో ఓడిపోయారు. 4 వ వార్డ్ నుంచి మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, 5 వ వార్డ్ నుంచి శనిగారపు చిన్నయ్య, 6 వ వార్డ్ నుంచి తోట సువర్ణ, 7 వ వార్డ్ నుంచి బోడ రాజేంద్ర ప్రసాద్, 9 వ వార్డ్ నుంచి రాజలింగు, 10 వ వార్డ్ నుంచి పెండెం పద్మ – రాజు, 11 వ వార్డ్ నుంచి సూరం చంద్రమౌళి, 12 వ వార్డ్ పర్వీన్ సుల్తానా -ఆరీఫ్, 13 వ వార్డ్ నుంచి బిరుదుల సత్యనారాయణ, 15 వ వార్డ్ నుంచి గోప సుజాత -రమేష్ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. కాగా, 8 వ వార్డ్ నుంచి రాందేని జమున- కుమార్, 14 వ వార్డ్ నుంచి మైలారపు సుధాకర్ లు బీ ఆర్ ఎస్ నుంచి గెలుపొందారు. ప్రజలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పై నమ్మకంతో అభివృద్ధి హామీల అమలు కోసమే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Leave a Reply