AP | చెత్తతో నిండిన రెవెన్యూ స్థలం..

AP | చెత్తతో నిండిన రెవెన్యూ స్థలం..

AP, బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : బాపట్ల మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కార్యాలయం అదనపు దస్త్రాలు భద్రపరుచు గది స్థలం డంపింగ్ యార్డును తలపిస్తుంది. 19వ శతాబ్దంలో తాసిల్దార్ కార్యాలయంలో దస్త్రాలను భద్రపరుచుకునేందుకు అదనపు స్థలంను కేటాయించి భవనాన్ని స్థాపించి దస్త్రాలను భద్రపరిచేవారు. క్రమేపి తాసిల్దార్ భవనం కింద మార్చుకున్నారు. ఆఖరిగా 1996 – 2000 సంవత్సరం కాలంలో ఎం వెంకటేశ్వర్లు తాసిల్దారుగా విధులు నిర్వహిస్తూ ఆ భవనంలోనే బస చేశారని రిటైర్డ్ తాసిల్దార్ తిరుమల శెట్టి మల్లయ్య సమాచారం తెలిపారు. వల్లయ్య తాసిల్దారుగా విధులు చేపట్టిన నాటికి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని చిల్ల చెట్లు ఏపుగా పెరిగి పాములు సంచరిస్తూ ఉన్నాయని ఆయన తెలిపారు.

పదవీ విరమణ అనంతరం ఆ భవనాన్ని నిర్మూలించడం జరిగిందని ఎవరు నిర్మూలించారనే సమాచారం తన వద్ద లేదని తెలిపారు. ఆ స్థలంను శుభ్రపరచుకొని మరేదైనా అనుబంధ శాఖ విధి నిర్వహణకు తాత్కాలిక భవనముతోనైనా ఉపయోగించుకోవచ్చునని పట్టణ ప్రముఖులు తెలియజేశారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కావడం కొసమెరుపు. బ్రిటిష్ కాలం నాడు నిర్మించిన తాసిల్దార్ కార్యాలయం నూతన భవనానికి రికార్డ్ ఎక్స్టెన్షన్ భవనం నూతన నిర్మాణానికి నిధులకు వినతి పత్రం అందజేసే నాయకుడు అధికారి కరువయ్యారనేది యదార్థం. ఉద్యోగుల భద్రతారీత్యా నూతన భవనాలు ఏర్పాటుతో ఉద్యోగులు అభద్రతాభావాన్ని వీడి స్వేచ్ఛగా విధులు నిర్వహించేందుకు దోహదపడతాయని ప్రముఖులు తెలియజేశారు.

Leave a Reply