Thailand | దారుణం…

Thailand | దారుణం…

  • డే కేర్ సెంటర్‌లో కాల్పులు
  • 34మంది మృతి

Thailand | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జ‌ర‌ప‌డంతో 34మంది మృతిచెందిన విషాద ఘటన థాయ్‌లాండ్ లో చోటుచేసుకుంది. సోంక్లాలోని డే కేర్ సెంటర్‌లో అభం శుభం తెలియని చిన్నారులని కూడా చూడకుండా అత్యంత అమానుషంగా కాల్పులు జరిపాడు. అనంతరం తానూ కాల్చుకొని మృతిచెందాడు.

ఈ కాల్పుల్లో మొత్తం 23 మంది చిన్నారులు, 11 మంది సిబ్బంది మృతిచెందారు. సమాచారం అందించిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు ఎవరు? ఎందుకింత క్రూరంగా ప్రవర్తిండానే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply