Makthal | నిజాయితీగా ఓటు హక్కు వినియోగించాలి

Makthal | నిజాయితీగా ఓటు హక్కు వినియోగించాలి

తొలిసారి ఓటు మధుర జ్ఞాపకం
యువ ఓటర్లు అన్నాచెల్లి కార్తికేయ వైశాలి
మక్తల్ లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువ ఓటర్లు అన్నా చెల్లి కార్తికేయ వైశాలి

Makthal | మక్తల్ , ఆంధ్రప్రభ : యువత నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించాలి.ప్రజాస్వామ్య పరిరక్షణకే ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన యువ ఓటర్లచన అన్నా చెల్లి ఇద్దరు తొలిసారి మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డు నుండి 25వ బూతులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారి అనుభవాన్ని ఆంధ్రప్రభతో పంచుకున్నారు. ఇద్దరం ఒకేసారి ఓటు హక్కు వినియోగించే అవకాశం దొరకడం మా అదృష్టం . తొలిసారి పోటు వేయడం గర్వంగా భావిస్తున్నాం. ఓటు హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా సద్వినియోగం చేసుకోవాలి. యువత ఎన్నికల్లో ఓటు హక్కును నిస్వార్ధంగా నిజాయితీగా ఉపయోగించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటుతో అండగా నిలవాలి. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటేశాం ఇక ప్రతి ఎన్నికల్లో ఎన్ని పనులున్న ఓటు మాత్రం పక్కా వేస్తాం.అవినీతి రహిత సమాజం కోసం యువత తమ ఓటును వినియోగించాలి.అందరూ విధిగా ఓటేయండి ప్రజాస్వామ్య పరిణాక్షణకు అండగా నిలవండి.

Leave a Reply