Distribution | ఎన్నికలు సజావుగా నిర్వహించాలి…

Distribution | ఎన్నికలు సజావుగా నిర్వహించాలి…
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్
Distribution | వికారాబాద్, ఆంధ్రప్రభ : బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ రోజు వికారాబాద్ జిల్లా మేరీ నాట్ పాఠశాల నందు ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ల ను పరిశీలించారు. బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను ,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎలక్షన్ మెటీరియల్ పంపిణి ని పరిశీలించారు.
పాఠశాలలో ఆవరణలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి… పోలింగ్ అధికారులకు ఇచ్చిన మెటీరియల్ ని చెక్ చేశారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పా ట్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వెళ్లి…ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారి గా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు.
బ్యాలెట్ పత్రాలు, బాక్స్ లు జాగ్రత్త గా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. డిస్ట్రి బ్యూ షన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏ ర్పాట్లు చేయాలని, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజ నం కల్పించాలని…విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు.
ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, త్రాగునీరు, లైటింగ్, పా ర్కింగ్ ప్రదేశాలు, వచ్చిపోయేదారులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రూట్ల ల వారీగా బస్సు లు బయలుదేరే విధంగా అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి నారాయణ లు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
