AP | పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి..

AP | పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి..
AP | గన్నవరం – ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవాడలోని ఎమ్మెల్యే కార్యాలయం లో వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధినుంచి మంజూరైన ఎల్‌ఓసీ పత్రాలను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందిన అవుటుపల్లి సామ్రాజ్యం కు రూ.1,54,559లు, మాదాల వారి గూడెం గ్రామానికి చెందిన పావులూరి వెంకట కుమారి కి రూ.1,50,000లు మంజూరు చేసిన పత్రాలను అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే పేదలకు వైద్య సహాయం అందిస్తూ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను నిరంతరంగా పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్న సీఎం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
