తిరుమల్ గెలుపు పక్కా

తిరుమల్ గెలుపు పక్కా
… ప్రచారంలో సింహం జోరు
… బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పట్టణం లోని 13వ వార్డు లో సల్వాజి తిరుమల్ గెలుపు పక్క అని వార్డు ఓటర్లు పేర్కొంటున్నారు. ఇంటింటికి ప్రచారంలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి తిరుమల్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతిరోజు గడపగడపకు వెళ్లి బ్యాలెట్ నమూనా అందించి 11వ తేదీన జరిగే పోలింగ్ లో సింహం గుర్తుకు ఓటు వేసి తనను మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్న తీరు ఓటర్లను ఆకట్టుకుంటుంది. అధికార, ప్రతిపక్షాల మాయ మాటలు కరెన్సీ నోట్లకు ప్రలోభపడవద్దని, అందుబాటులో ఉండి సేవలందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈసారి సింహం గుర్తుకు మాత్రమే ఓటు వేస్తామని, తిరుమల్ ను పాలకవర్గంలో కూర్చోబెడతామని ఓటర్లు శపధం చేస్తున్నారు. తిరుమల్ ప్రచార సరళి అధికార ప్రతిపక్ష పార్టీలో నాయకులకు గుబులు పుట్టిస్తుంది. మంచి మెజార్టీతో తిరుమల్ గెలుపు పక్క అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రచారం లో సొన్నయి టెంకం సురేష్, బాకం సుమ లత, సామ తిరుపతి, చిట్టెటి సుమ లత రెడ్డి, మధుకర్, అనిత లతో పాటు పలువురు పాల్గొన్నారు.
