అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా..

అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా..

  • 9వ వార్డు స్వతంత్ర అభ్యర్థి అనిత బాలాజీ సూత్రావే

భైంసా, ఆంధ్రప్రభ : ఈనెల 11 నిర్వహించనున్న మునిసిపల్ ఎన్నికలలో తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని 9వ వార్డు స్వతంత్ర అభ్యర్థి అనిత బాలాజీ సూత్రావే పేర్కొన్నారు మేరకు శుక్రవారం బైంసా పట్టణంలోని 9వ వార్డులలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ తనకు ఒక్కసారి కౌన్సిలర్ గా అవకాశం కల్పిస్తే కాలనీ అభివృద్ధి చేసి చూపిస్తానని హామీనీచ్చారు.. 9వ వార్డు లో నెలకొన్న సమస్యలన్నింటిని మూడు నెల ల్లోనే తెలుసుకుని దశల వారిగా సమస్యలను పరిష్కరించి మీముందుకు వస్తామని ఓటర్లకు భరోసా కల్పించారు. వార్డులో నెలకొన్న సమస్య లు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు పెద్దల సహకారంతో పరిష్కరిస్తామన్నారు. వార్డు ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. ఆయన వెంట కాలనీవాసులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply