MLA | సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ….

MLA | సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ….

MLA | నరసరావుపేట, ఆంధ్రప్రభ : పేదల ఆరోగ్యానికి అండగా కూటమి ప్రభుత్వం 33 మంది లబ్ధిదారులకి రూ .20.17 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను ఈ రోజు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గంలో పేదల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 18 నెలల కాలంలో నరసరావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన మొత్తం 729 మంది లబ్ధిదారులకు రూ.6 కోట్ల 81 లక్షలు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అదేవిధంగా ఎల్‌ఓసీ (లెటర్ అఫ్ క్రెడిట్) ద్వారా 173 మంది లబ్ధిదారులకు రూ.1 కోటి 37 లక్షల ఎల్ ఓ సి చెక్కులు అందజేసినట్లు పేర్కొన్నారు. పేద ప్రజలు అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ వారికి అండగా నిలుస్తోందని ఆయన అన్నారు. అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తోడ్పాటును అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Leave a Reply