TG | జైనూర్‌లో విద్యుత్ లోక్ అదాలత్

TG | జైనూర్‌లో విద్యుత్ లోక్ అదాలత్

TG | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయంలో ఈనెల 4న బుధవారం ఉదయం 10:30 నుండి 1:00 వరకు విద్యుత్ లోక్ ఆదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఆసిఫాబాద్ సబ్ డివిజన్ డి ఈ బండ వీరేశం మంగళవారం తెలిపారు. ఈ లోక్ అదాలత్ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లులో ఏమైనా సమస్యలు ఉంటే సరి చేయడం జరుగుతుందని విద్యుత్ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అసిఫాబాద్ రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని జైనూర్, సిర్పూర్ (యు) లింగాపూర్ మండలాల్లోని విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను రిష్కరించుకోవడానికి విద్యుత్ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, వీఆర్వోలు పాల్గొంటారని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని డి ఈ వీరేశం కోరారు.

Leave a Reply