Honor | ఉద్యోగ విరమణ సన్మానం

Honor | కుంటాల, ఆంధ్రప్రభ : కుంటాల మండలంలోని కల్లూరు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆడెపు రాజేశ్వర్ పదవి విరమణ పొందడంతో పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమేనని.. పాఠశాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను పలువురు గుర్తు చేశారు. ఉద్యోగంలో బదిలీలతో పాటు పదవి విరమణ ఉద్యోగ రీతిలో సహజమని పేర్కొన్నారు.

విద్యార్థులకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు క్రమశిక్షణకు మార్గదర్శకుడైనటువంటి ఆయన పదవీ విరమణ పొందడం చాలా గర్వకారణమని పలువురు అన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తన వంతు ఎంతో కృషి చేశారని పాఠశాల అభివృద్ధి తన ద్యేయంగా పనిచేసే గొప్ప వ్యక్తి రాజేశ్వర్ అని కొరియాడారు కాంప్లెక్స్ సమావేశాల్లో సైతం ఉపాధ్యాయులకు క్రమశిక్షణ గల శిక్షణ ఇస్తూ ఉపాధ్యాయులకు విద్యార్థులకు మెరుగైన బోధన అందించడమే లక్ష్యం అని ఉపాధ్యాయులకు తెలిపారు.

అదేవిధంగా వారి దంపతులకు ఘనంగా శాలువా పూలమాలతో తోపాటు మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెంట వార్ దశరథ్, మండల విద్యాధికారి ముత్యం, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు తోట నరేంద్రబాబు, జిల్లా అధ్యక్షులు జె లక్ష్మణ్, మాజీ సర్పంచ్ చిన్నారెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయులు మిట్టపల్లి నర్సయ్య, వివిధ సంఘాల ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులు, నాయకులు , ఉపాధ్యాయులు విద్యార్థులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply