CM | కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు సీఎం దిశానిర్దేశం

CM | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్నమున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్‌ అక్కడి నుండే కాంగ్రెస్‌ పార్టీ నేతల ఆన్‌లైన్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలపై సమావేశం జరిగింది.

ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు. అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం వద్దని చెప్పారు. ప్రతి డివిజన్‌, ప్రతి వార్డు గెలుపు పార్టీకి ముఖ్యమేనన్నారు. రెబల్స్‌ విషయంలో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సిఎం రేవంత్‌ దిశానిర్దేశం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ధీటుగా కాంగ్రెస్‌ అభ్యర్థులు ఉండాలని సూచించారు.

Leave a Reply