Jannaram | అడవుల్లోని 12 గుడిసెల తొలగింపు..
Jannaram | అడవుల్లోని 12 గుడిసెల తొలగింపు..
Jannaram | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ జన్నారంఫారెస్ట్ బీట్లో గిరిజనులు వేసిన గుడిసెలను బుధవారం ఉదయం అటవీశాఖ అధికారులు తొలగించారు. కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్డీపీటీ, సీఎఫ్ శాంతారాం ఆదేశాల మేరకు స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్ సూచనతో జన్నారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె.లక్ష్మీనారాయణ, తాళ్ల పేట, ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు వి.సుష్మారావు, జి.లక్ష్మీనారాయణ, పలువురు అటవీ అధికారులు జన్నారం అటవీ బీటులోని కంపార్ట్మెంట్ నెంబరు 380 లో వేసిన 12 గుడిసెలను మూకుమ్మడిగా తొలగించారు. ప్రోక్లైన్లతో జిల్లాలోని 100 మంది అటవీ అధికారులు ఆ గుడిసెలను తొలగించారు. ఈ విషయమై స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్ ను సంప్రదించగా, తమ రిజర్వ్ ఫారెస్ట్ లో వేసిన గుడిసెలను ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు తొలగించామన్నారు.
