TG | ముంపు గ్రామంగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతి

TG | ముంపు గ్రామంగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతి
TG | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఊట్కూర్ పెద్ద చెరువు రిజర్వాయర్ గా మారుస్తున్న నేపథ్యంలో ఊట్కూర్ మండల కేంద్రాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని ఈ రోజు నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు బీఆర్ఎస్, నాయకులు వినతి పత్రం సమర్పించారు. ప్రాజెక్టు డీపీఆర్ విడుదల చేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని విజ్ఞప్తి చేశారు. ఊట్కూర్ పెద్ద చెరువు ప్రస్తుతం ఉన్న నీటి సామర్థ్యంతోనే గ్రామ పరిసరాల్లో ఇండ్లు నిర్మించినందుకు పునాదులు తవ్వితే నీటి ఊట వస్తుందని పేర్కొన్నారు. రిజర్వాయర్ గా మారిస్తే రానున్న కాలంలో పెద్ద చెరువు గ్రామానికి ముంపు నష్టం పొంచిందనితెలిపారు.
ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఎత్తిపోతల పథకంతో భూములకు సాగునీరు అందుతున్న గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ముంపు పొంచిఉందనిఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ పనులు ప్రారంభించక ముందు ఊట్కూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు కలెక్టర్ సిక్తాపట్నాయక్ స్పందించి ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించి ఊట్కూర్ రిజర్వాయర్ ఏర్పడితే జరిగే నష్టం పై నివేదిక ఇచ్చేందుకు ప్రత్యేక కమిటీ వేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వి జిల్లా అధ్యక్షులు శివారెడ్డి, ఊట్కూర్ పట్టణ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, నాయకులు శివారెడ్డి, ఈ బాధూర్ రెహమాన్, షేక్ సమీ, తరుణ్ రెడ్డి, అంజి, అభి తదితరులు పాల్గొన్నారు.
