Kareemabad | శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో విశేష పూజలు

Kareemabad | శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో విశేష పూజలు

Kareemabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : భక్త మార్కండేయ దేవాలయంలో ఉదయం నుండి పూజలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు శ్రీ భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకొని పలు శివాలయాలు, భక్త మార్కండేయ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 34 డివిజన్ శివనగర్ శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయంలో ఉదయం నుండే శివుడికి మార్కండేయుడికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మృత్యుంజయుడుగా శ్రీ భక్త మార్కండేయుడు భక్తులచే పూజలు అందుకుంటున్నారు. పూజలో ఆలయ అభివృద్ధి కమిటీ కార్యవర్గం వడ్నాల మల్లయ్య, వడ్నాల సదానందం, పాశికంటి రవికుమార్, పాశికంటి రాజేశ్వరరావు రాపల్లి చంద్రమౌళి, ఊరుగొండ సారంగపాణి, పూజారులు ముదిగొండ అభిషేక్, ముక్కు కృష్ణ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply