Divider | పట్టణంలో ప్రధాన రోడ్డు డివైడర్ ధ్వంసం

Divider | పట్టణంలో ప్రధాన రోడ్డు డివైడర్ ధ్వంసం
- వర్తక రవాణా లారీ వల్ల ధ్వంసం
- ఇరుకు రోడ్డులో భారీ లారీలు
Divider | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో ప్రధాన రోడ్డు డివైడర్ లారీ వెనుక నుండి ఢీకొనడం వల్ల పాక్షికంగా ధ్వంసం అయ్యింది. ఈ రోజు సాయంత్రం 14 టైర్ల లారీ ట్రాన్స్పోర్ట్ సామాన్లతో 4:30 గంటల ప్రాంతంలో పట్టణంలోని ప్రధాన రోడ్డు నుండి వాణి బుక్ స్టాల్ ఇరుకు గల్లికి భారీ లారీ తీసుకెళ్లే ప్రయత్నంలో లారీ డ్రైవర్(Driver)ఇరుకు గల్లీలోకి వెళ్లేందుకు వెనుకకు ముందుకు తీస్తూ ప్రధాన రోడ్డు డివైడర్ను లారీ వెనుక నుండి ఢీకొనడం జరిగింది.
దీంతో డివైడర్ పాక్షికంగా దెబ్బతినడం జరిగింది. డివైడర్(divider) లోని కట్ రాయిలు రోడ్డుమీద పడి ఉండడం వల్ల ప్రధాన రోడ్డులో ఇతర వాహనాలు వెళ్లే క్రమంలో ప్రమాదంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగానే పట్టణంలోని వెలంపల్లి రోడ్డులో భారీ వాహనాలు ఢీకొనడం వల్ల డివైడర్ పాక్షికంగా దెబ్బతిన్న సంఘటనలు ఉన్నాయి. ప్రజాధనం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసిన డివైడర్లు ధ్వంసం అవుతుంటే అధికారులు స్పందించడం లేదని ప్రజలు అంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ద్వంసమైన డివైడర్లను మరమ్మత్తు చేయించి, డివైడర్ నుండి రోడ్డు మీద పడిపోయిన కట్ రాయిలను తొలగించాలని, ట్రాన్స్‌పోర్టు లారీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
