4.4 lakh followers | 717 మద్యం దుకాణాలకు మూత

4.4 lakh followers | 717 మద్యం దుకాణాలకు మూత

4.4 lakh followers |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, బస్టాండ్‌ల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయంతో మొత్తం 717 లిక్కర్ దుకాణాలు మూతపడనున్నాయి. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

సామాజిక బాధ్యత దృష్ట్యా ప్రజలకు ఇబ్బందిగా మారుతున్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ప్రార్థనా మందిరాలు, విద్యాసంస్థలు, బస్టాండ్‌ల సమీపంలోని షాపులను మూసివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

మరోవైపు తమిళనాడు సీఎంవో అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాకు ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో సుమారు 4.4 లక్షల ఫాలోవర్లు మాత్రమే ఉండగా, విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంఖ్య 20 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో విజయ్‌కు పెరుగుతున్న ఆదరణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Leave a Reply