ప్రచారంలో దూసుకుపోతున్న BRS అభ్యర్థి సంజీవరెడ్డి..

ప్రచారంలో దూసుకుపోతున్న BRS అభ్యర్థి సంజీవరెడ్డి..

ఖమ్మం రూరల్, ఆంధ్రప్రభ : ఏదులాపురం 22వ డివిజన్ బిఆర్ఎస్ అభ్యర్థి సంజీవరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. బుధవారం సాయి గణేష్ నగర్ లో, విస్తృత ప్రచారం ఇంటింటికి నిర్వహించారు. తనదైన శైలిలో ఓటర్లను కలిసి ఓటును అభ్యసిస్తున్నారు. తాను గెలిస్తే అభివృద్ధి చేసే అంశాలను అర్థమయ్యే రీతిలో ఓటర్లకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచార వేగం పుంజుకున్నది. గెలిపించే బాధ్యత ఓటర్లుదని అభివృద్ధి చేసే బాధ్యత తమదని ప్రచారం చేస్తూ అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తనపై పూర్తి నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు గెలిచి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మంచి పేరును పొందుతానని అభ్యర్థి సంజీవరెడ్డి ఆంధ్ర ప్రభ తో ముచ్చటించారు. స్థానికుడిని అందరికీ పరిచయస్తుడిని అంటూ పలకరింపులో ముందు వరుసలో ఉన్నందున తన గెలుపు నల్లేరు మీద నడకేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply