20ministers | కేర‌ళ సీఎంగా వి.డీ. స‌తీశ‌న్‌

20ministers | కేర‌ళ సీఎంగా వి.డీ. స‌తీశ‌న్‌

20ministers | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : కేరళ సీఎంగా వి.డి.సతీశన్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సతీశన్ ప్రమాణస్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సతీశన్‌తో పాటు మంత్రులుగా 20 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ (UDF) ఘన విజయం సాధించిన అనంతరం, కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేసింది. గత పాతికేళ్లుగా పారవూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వి.డి. సతీషన్.. 2021 నుంచి కేరళ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.

Leave a Reply