1991Batch | సంస్కరణల సారథికి పోలీసుల గౌరవ వందనం

1991Batch | సంస్కరణల సారథికి పోలీసుల గౌరవ వందనం
1991Batch | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ఇవాళ అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. కార్యాలయ ఆవరణలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు చేపట్టారు.
1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌కు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విశేష అనుభవం ఉంది. కెరీర్ ప్రారంభంలో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తూ క్లిష్ట పరిస్థితుల్లో శాంతిభద్రతలను సమర్థంగా కాపాడారు.

తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, సైబరాబాద్ కమిషనర్‌గా, ట్రాఫిక్ కమిషనర్‌గా, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పోలీస్ శాఖలో సాంకేతికతను ప్రవేశపెట్టి వినూత్న మార్పులు తీసుకురావడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థలో తనదైన ముద్ర వేసిన సీవీ ఆనంద్, పూర్తి స్థాయి డీజీపీగా రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి పోలీసింగ్ విధానాలు అమలు చేస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
