16mayipl | నేడు గుజ‌రాత్‌, కోల్‌క‌తా ఢీ

16mayipl | నేడు గుజ‌రాత్‌, కోల్‌క‌తా ఢీ

16mayipl | గుజ‌రాత్ గెలిస్తే ప్లేఆఫ్స్‌కు..
టేబుల్‌లో సెకండ్ ప్లేస్‌లో జీటీ
ఎనిమిదో స్థానంలో కోల్‌క‌తా
గెలువ‌కుంటే కేకేఆర్ ఇంటికే..
కోల్‌క‌తా ఈడెన్ గార్డెన్‌లో మ్యాచ్‌
రాత్రి 7.30గంట‌ల‌కు ప్రారంభం

16mayipl | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇవాళ మ‌రో ఆస‌క్తిక‌ర పోరు జ‌ర‌గ‌నుంది. గుజరాత్ టైటాన్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ప్లేఆఫ్స్ రేసులో అత్యంత కీలకమైన దశలో తలపడుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య రాత్రి 7.30 గంట‌ల‌కు కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానానికి పోటీపడుతుండగా, కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసులో నిల‌వాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది.

గుజ‌రాత్ జ‌ట్టు మంచి ఫామ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే 18 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. కేకేఆర్ ఓడితే మాత్రం టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 4 గెలిచి, 6 ఓడగా, ఒకటి రద్దయింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన 3 మ్యాచ్‌లలోనూ తప్పక గెలవాలి. అలాగే ఇతర జట్ల ఫలితాలపై కూడా కేకేఆర్ ఆధారపడాల్సి ఉంటుంది.

ఎలాగైనా గెలవాలన్న కసితో కేకేఆర్ ప్లేయర్లు బరిలో దిగుతున్నారు. అటు బలమైన ఓపెనర్లు, సత్తా ఉన్న ఫాస్ట్ బౌలర్లతో గుజరాత్ కూడా ఏ మాత్రం తక్కువేం లేదు. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌ అయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపిస్తోంది. మరి ఈ మ్యాచ్ లో పంజా ఎవరు విసురుతారో చూడాలి.

ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉండి, టాప్-2 స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు తలపడిన సందర్భాల్లో గుజరాత్ టైటాన్స్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో గుజరాత్ ఎక్కువ మ్యాచ్‌లను గెలుచుకుంది.

CLICK HERE TO READ 2.22Article | మ్యాచ్ డిలే.. రూ.12ల‌క్ష‌ల ఫైన్‌

CLICK HERE TO READ MORE

Leave a Reply