కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు..

కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు..

హామీల అమలులో వైఫల్యాలపై కోడూరులో వైఎస్సార్సీపీ నిరసన

కోడూరు, ఆంధ్రప్రభ:

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ గురువారం కోడూరు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీల పత్రాలు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన బాండ్ల ప్రతులను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించిందని నాయకులు ఆరోపించారు.

ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. రెండేళ్లు పూర్తయినా కీలక హామీలు నెరవేరకపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొందని పేర్కొన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply