167-NH | హెచ్‌ఐసీసీ వేదికగా వర్చువల్ విధానంలో..

167-NH | హెచ్‌ఐసీసీ వేదికగా వర్చువల్ విధానంలో..

167-NH | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇవాళ (ఆదివారం) తెలంగాణ రాష్ర్టంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ పెద్దపీట వేశారు. సుమారు రూ.9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా, ఇంధన రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. హైదరాబాద్-పనాజీ ఎకనమిక్ కారిడార్‌తో పాటు NH-167లో గుడెబెల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు 4 వరుసల రహదారి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్ విలువ 3,175 కోట్ల రూపాయలు అని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా. 2,360 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన చేస్తారు. ఇక 1,243 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ మూడో రైల్వే లైన్ ప్రారంభిస్తారు. వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్, హైదరాబాద్ మల్లాపూర్‌లో పెట్రోలియం టెర్మినల్ వంటి ప్రాజెక్టులు కూడా మోదీ షెడ్యూల్‌లో ఉన్నాయ్.

Leave a Reply