బొల్లా అరెస్టుకు వ్యతిరేకంగా ప్రత్యేక పూజలు..
బొల్లా అరెస్టుకు వ్యతిరేకంగా ప్రత్యేక పూజలు..
అరెస్టుపై వైసీపీ నేతల నిరసన
శావల్యాపురం, ఆంధ్రప్రభ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు, వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును అక్రమంగా అరెస్టు చేశారంటూ శావల్యాపురం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం మండలంలోని మతుకుమల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బొల్లా బ్రహ్మనాయుడు ఎలాంటి తప్పు చేయలేదని, ఆయన నిర్దోషిగా విడుదల కావాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా మండల కన్వీనర్ బోడేపూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తమ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడుపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని ఆరోపించారు.
జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కావూరి మాబు సుబానయ్య మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందించిన బ్రహ్మనాయుడుకు న్యాయం జరగాలని, ఆయన త్వరగా విడుదల కావాలని ఆకాంక్షించారు. రాజకీయ కక్షసాధింపులకు ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఉపాధ్యక్షుడు జుజ్జూరి ఐరామ్మూర్తి, వైసీపీ నాయకులు చింతల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ కొండలు, ముండ్రు జీవా, వైస్ ఎంపీపీ చెన్నంశెట్టి రంగారావు, శానంపూడి మాజీ సర్పంచ్ మొనపాటి శ్రీనివాసరావు, దూదేకుల మదార్, బొందిలిపాలెం మాజీ సర్పంచ్ చింతా విజయ్ కుమార్, తన్నీరు అంకారావు, పాపసాని బ్రాహ్మయ్యతో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
