Vijayawada | మతాలకతీతంగా పూజలు

Vijayawada | మతాలకతీతంగా పూజలు
- అంకమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకున్న డీసీపీ షేక్ షిరీన్ బేగం
Vijayawada | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలో మతసామరస్యానికి మరోసారి సజీవ రూపం దాల్చింది. డీసీపీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్ షిరీన్ బేగం.. నగరంలోని ప్రసిద్ధ అంకమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాసేవే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్న ఆమె, దేవుడు మతాల మధ్య గీతలు వేయడానికే కాదు, మనుషులను కలిపే శక్తిగా ఉన్నాడని తన చర్యల ద్వారా నిరూపించారు. మతం పేరుతో విడిపోయే భావనలు పెరుగుతున్న ఈ కాలంలో, ఆమె ఉద్దేశం సమాజానికి ఒక బలమైన సందేశంగా ఇచ్చారు. అంకమ్మ తల్లి గుడిలో పూజలు స్వీకరించిన అనంతరం, ఆలయ చైర్మన్ చేతుల మీదుగా ప్రత్యేక సన్మానం అందుకోవడం అక్కడి భక్తులను, ప్రజలను భావోద్వేగానికి గురిచేశారు.
