వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ ఎస్టీ కోర్టు వంశీని కస్టడీకి అనుమతింది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారణ చేపట్టనున్నారు. లాయర్ సమక్షంలో వంశీని విచారించాలని కోర్టు అనుమతించింది. అలాగే ఉదయం, సాయంత్రం మెడికల్ టెస్ట్ లు చేయాలని సూచించింది.
Breaking | వల్లభనేని వంశీకి మూడు రోజుల పోలీస్ కస్టడీ
