న్యూయార్క్, ఆంధ్రప్రభ : జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన పాశవిక ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా, పాకిస్థాన్ సంయమనంతో వ్యవహరించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉన్న ఆందోళనకర పరిస్థితిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నిశితంగా పరిశీలిస్తున్నారని ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఈ ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండిస్తోందన్న ఆయన… ఈ సమయంలో పాక్, భారత్ సంయమనం పాటించాలని సూచించారు.
UNO | సంయమనం పాటించండి – భారత్, పాక్కు ఐక్యరాజ్యసమితి సూచన
