Under 15 | జాతీయ స్థాయి కుస్తీ పోటీ-లకు ఆదివాసీ బిడ్డలు…

Under 15 | జాతీయ స్థాయి కుస్తీ పోటీ-లకు ఆదివాసీ బిడ్డలు…

  • సోములగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్ధినీలు ఎంపిక
  • విద్యార్ధినీలను అభినందించిన ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్‌
  • తమిళనాడు ప్రయాణ ఖర్చులకు ఆర్ధిక సహాయం చేసిన జమాల్‌ ఖాన్‌

Under 15 | చింతూరు పోలవరం జిల్లా, ఆంధ్రప్రభ : మన్యంలో ఆదివాసీ ఆడ బిడ్డలు జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు. చింతూరు ఐటీడీఏ పరిధిలోని విఆర్‌ పురం మండలంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సోములగూడెం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికొన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థినీలైన మడకం సురేఖ, బంధం సరిత, బీరబోయిన శ్రావణిలు అండర్‌ 15 విభాగాలలో తమిళనాడు రాష్ట్రం సేలంలో ఈ నెల 26,27,28 తేదీలలో జరిగే జాతీయ స్థాయి కుస్తీ పోటీ-లకు ఎంపికయ్యారు.

మడకం సురేఖ 33 కేజీల, బంధం సరిత 36 కేజీల అండర్‌ 15 విభాగాల్లో ఎంపిక కాగా బీరబోయిన శ్రావణి 40 కేజీల విభాగంలో చత్తీష్‌గఢ్‌ రాష్ట్రం రాయపూర్‌లో మార్చి నెలలో జరగనున్న పోటీ-లకు ఎంపికయ్యారు. గత నెలలో చిత్తూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌ 15 33 కేజీల, 36కేజీల, అండర్‌ 17, 40 కేజీల విభాగా పోటీ-ల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మూడు బంగారు పతకాలు సాధించారు. అదే విధంగా ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌ కూడా కైవాసం చేసుకోవడంతో ఈ ముగ్గురు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తమిళనాడులో జరగబోయే పోటీల్లో పాల్గోనేందకు బయలుదేరుతున్న క్రమంలో బుధవారం చింతూరు ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.

Under 15 |

జాతీయ స్థాయి కుస్తీ పోటీ-లకు ఎంపి-కై-న విద్యార్థినిలను పీవో అభినందంచిడంతో పాటు జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని మంచి విజయం సాధించి రావాలని ఆశీస్సులతో పాటు ఆర్థిక ప్రోత్సాహం అందించారు. విద్యార్థినీలు ప్రాక్టీస్‌ కొరకు పాఠశాలకు కుస్తీ మ్యాట్స్‌ అందజేయడం జరుగుతుందని పీవో పేర్కోన్నారు. అదే విధంగా చింతూరు జేకేసీటీ చైర్మన్‌ జమాల్‌ ఖాన్‌ కలవగా ఆయన ఆడ బిడ్డలను అభినందించి, ఆ విద్యార్థినులను ఘనంగా సన్మానించారు. తమిళనాడు ప్రయాణ ఖర్చుల కోసం రూ. 15 వేల రూపాయాలను ఆర్ధిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూవో శంకరయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు పూరి శివ కుమార్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత, వార్డెన్‌ భద్రమ్మ, సిబ్బంది లక్ష్మణ్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Under 15 |

Leave a Reply