Travels | ముగ్గురు మృతి, 30మందికి గాయాలు

Travels | ముగ్గురు మృతి, 30మందికి గాయాలు

Travels | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌లోని రాజ్‌గఢ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ట్రక్కును ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.

Travels

ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 30 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply