Tragedy | 250 మంది గల్లంతు

Tragedy | 250 మంది గల్లంతు
Tragedy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఓ పడవ మునిగిపోవడంతో చిన్నారులు సహా దాదాపు 250 మంది గల్లంతయ్యారు.
అండమాన్ సముద్రంలో భారీ విషాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో మలేషియాకు వెళ్తున్న ఓ పడవ మునిగిపోవడంతో దాదాపు 250 మంది గల్లంతైనట్లు సమాచారం.
ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్ (UNHCR), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దక్షిణ బంగ్లాదేశ్‌లోని టెక్నాఫ్ నుంచి బయలుదేరిన ట్రాలర్ బలమైన గాలులు, ఎగిసిపడిన కెరటాలు, పరిమితికి మించిన ప్రయాణికులతో ఉండటం వల్ల మునిగిపోయినట్లు పేర్కొన్నారు.
ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుంచి బయలుదేరిన ఈ పడవలో ఉన్నవారు కాక్స్ బజార్ శరణార్థి శిబిరాల నుంచి మలేషియాకు వలస వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
