Tirupati |తిరుమలలో తగ్గిన రద్దీ

Tirupati |తిరుమలలో తగ్గిన రద్దీ
- టెన్త్, ఇంటర్ పరీక్షల వేళ..
- తగ్గిన భక్తుల రాక
- త్వరగా శ్రీవారి దర్శనం
Tirupati | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : నిన్నమొన్నటి వరకు తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసింది. శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావచ్చారు. దీంతో కంపార్ట్‌మెంట్‌లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి కూడా గంటల కొద్దీ సమయం పట్టింది. కానీ ఈ నెలలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఉండటంతో తిరుమలకు భక్తుల రాక తగ్గింది. దీంతో స్వామివారి దర్శనం త్వరగా దక్కుతుంది. ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దర్శనం టోకెన్లు లేకపోయినా 5 – 6 గంటల్లో స్వామి వారి దర్శనం అయిపోతోంది. రూ. 300ల శీఘ్ర దర్శనానికి ఒకటి నుంచి రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. ఉచిత దర్శనం కోసం భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

నిన్న శ్రీవారిని 69,389 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 20,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.72 కోట్ల ఆదాయం వచ్చింది. విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేంత వరకు భక్తుల రద్దీ సాధారణంగా ఉండే అవకాశం ఉంది. తిరుమలకు వెళ్లాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.

శ్రీవారి హుండీ ఆదాయం వివరాలు
నిన్న ఒక్కరోజులోనే 69,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 20,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా మొత్తం రూ.3.72 కోట్ల ఆదాయం లభించింది. విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యే వరకు తిరుమలలో భక్తుల రద్దీ ఇలానే సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్ల తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు ఇది అనుకూల సమయంగా భావించవచ్చు.
