2yrs boy | పిచ్చి కుక్క దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

2yrs boy | పిచ్చి కుక్క దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు..
2yrs boy | అందుగులపల్లిలో కుక్క దాడి ఘటన వివరాలు
పసివాడిపై దాడి: స్థానికుల్లో కలకలం
గ్రామాల్లో పెరుగుతున్న కుక్కల బెడద
రేబిస్ నియంత్రణలో అధికారుల వైఫల్యం
బయటికి రావడానికే జంకుతున్న గ్రామస్తులు
శాశ్వత పరిష్కారం కోసం స్థానికుల డిమాండ్
2yrs boy పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో పిచ్చి కుక్క దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో రెండేళ్ల పసివాడు తోడెంగుల నిహాన్స్ తీవ్ర గాయాలకు గురికావడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
బాలుడు తన ఇంటి ముందు నిలబడి ఉండగా ఆకస్మాత్తుగా కుక్క విరుచుకు పడింది. నిహాన్స్ భుజం, చెంపపై తీవ్రంగా కొరికి గాయపరిచింది. చిన్నారి కేకలు విని కుటుంబ సభ్యులు వచ్చే లోపే బాలుడు కుక్క దాడిలో గాయపడ్డాడు. అదే క్రమంలో ఆ కుక్క గ్రామానికి చెందిన కొయ్యడ ఓదెలు, నారాయణలపై కూడా దాడి చేసి గాయపరిచింది. బాధితులను వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇంటి గుమ్మం ముందే ఆడుకుంటున్న పసివాడికి రక్షణ లేని పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రి బెడ్‌పై నొప్పితో విలవిలలాడుతున్న ఆ చిన్నారిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామాల్లో కుక్కల బెడద ప్రాణాంతకంగా మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కుక్కల సంతతి విపరీతంగా పెరుగుతున్నా పంచాయతీలు నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. రేబిస్ నిరోధక టీకాలు వేయించడం, పిచ్చి కుక్కల పట్ల ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నిర్లక్ష్యంకి సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
గ్రామస్తులు బయటకు రావాలన్నా. పిల్లలను బడికి పంపాలన్నా, పొలం పనులకు వెళ్లాలన్నా జంకుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీధి కుక్కల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
