మొక్కజొన్న కొనుగోలు వెంటనే చేయాలి

మొక్కజొన్న కొనుగోలు వెంటనే చేయాలి

మార్కెట్ యార్డ్ లో ఉన్న నిలువలను తరలించాలి
మూడు రోజుల్లో మొక్కజొన్న సమస్య తీర్చకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన
మార్కెట్ కార్యాలయం ముందు టిఆర్ఎస్ ధర్నా
నియోజకవర్గ వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన

నాగర్ కర్నూల్ జిల్లా ,ప్రతినిధి ఆంధ్రప్రభ : మొక్కజొన్న కొనుగోలు వెంటనే కొనుగోలు చేయాలని నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని తిమ్మాజిపేట,బిజినపల్లి,తెల్కపల్లి,నాగర్ కర్నూల్ కొనుగోలు కేంద్రాల దగ్గర టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు , నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు నాగర్ కర్నూల్ మార్కెట్ కార్యాలయం ముందు ఆందోళన ధర్నా నిర్వహించారు సింగల్ విండో కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మూడురోజుల్లో గత 20 రోజులుగా కాంట చేసిన మొక్కజొన్న ధాన్యం గోదాములకు తరలించకపోతే కలెక్టర్,ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రైతుల పక్షాన నిలబడి మాట్లాడితే రాజకీయం అంటారు,రైతులకు మాత్రం న్యాయం చెయ్యలేని దుస్థితిలో ఉన్నారని ఆరోపించారు
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో గత నెల 15 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తూతుమంత్రంగా కొనుగోలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులతో మాట్లాడి గత నెల రోజులుగా వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు
ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న పంటను గోదాంలకు తరలించాలి..

డిమాండ్ చేశారు..
మిగిలిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని, దాదాపు నలభై రోజులుగా రైతులు మార్కెట్లో ఉంటున్నారుని, పంట పండించడానికి రైతు ఎంత కష్టపడతాడో అంతకంటే ఎక్కువ అమ్ముకోవడానికి కష్టపడాల్సి వస్తుంది అని, పంట కొనమని రైతులు రోడ్డెక్కల్సిన పరిస్థితి నెలకొందని నాయకులు విమర్శించారు. మొక్కజొన్న దాన్యమును గోదాములకు తరలించలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వంఅని నెల రోజుల నుంచి పడిగాపులు కాస్తున్న రైతులను పట్టించుకోలేని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను ఆరోపించారు. మొక్కజొన్న లను కాంట వేసి 20 రోజులు అయితే కూడా వాటిని గోదాములకు తరలించాలేని అసమర్థ సర్కార్ అని 20 రోజుల నుంచి రైతుల కళ్ళలో కన్నీళ్లు కార్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులు 20 రోజుల నుంచి పడిగాపులు కాస్తూ కనీసం మార్కెట్ యాల్లో మినిమం సదుపాయాలు లేకుండా ఎండకు వానకు తల్లడిల్లి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మార్కెట్ యార్డ్ కి తెచ్చి కాంటా వేసిన ధాన్యాన్ని గోదాములకు తరలించలేని , పండించిన పంటకు బోనస్ ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం అని కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం డబ్బులు ఇవ్వడానికి అయితే ఉన్నాయి కానీ ఇవాళ రైతు పండించిన మొక్కజొన్న దాన్యమును మార్కెట్ యార్డ్ నుంచి గోదాములకు తరలించడానికి లారీలు లేవని చేతులెత్తేస్తున్న ప్రభుత్వం అన్నారు. మూడు రోజుల్లో మార్కెట్ యార్డులోని మొక్కజొన్న ధాన్యమును మొత్తమును గోదాములకు తరలించాలి లేనిపక్షంలో పెద్ద ఎత్తున రైతుల తో కలిసి కలెక్టర్,ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడించి ధర్నా చేస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో గ్రంథాలయం మాజీ చైర్మన్ హనుమంతరావు, మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటయ్య మాజీ జెడ్పిటిసి శ్రీశైలం మన్యపు రెడ్డి మాధవరెడ్డి మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పులేందర్ రెడ్డి తిమ్మాజిపేట నాయకులు వేణుగోపాల్ గౌడ్ ప్రదీప్ ఆయా మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు. రైతులు పాల్గొన్నారు

Leave a Reply