గ్రామీణ వైద్యుల ఆర్ధిక సహాయం..
గ్రామీణ వైద్యుల ఆర్ధిక సహాయం..
కొత్తగూడ, ఆంధ్రప్రభ : సహచర ఆర్ఎంపి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే. మండలం లోని వెలుబెల్లి గ్రామం లో ఆర్ఎంపి గా పని చేస్తున్న బొజ్జ జంపయ్య అనారోగ్యం తో మృతి చెందారు. వారి కుటుంబానికి ఆర్ఎంపి వైద్యుల బృందం గురువారం పరామర్శించి 23500 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమం లో గ్రామీణ వైద్యులు ఎడ్ల రమేష్, వెంకటనారాయణ చారి, రవీందర్, శ్రీనివాస్,క్రిష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.
