Terrorist Attack | ప్రధాని కఠిన హెచ్చరిక…

Terrorist Attack | ప్రధాని కఠిన హెచ్చరిక…
Terrorist Attack | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క : పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అమరులను స్మరించారు. ఉగ్రవాదంపై భారత్ ఎప్పటికీ తలొగ్గదని స్పష్టం చేశారు.
పహల్గాం ఉగ్రదాడి వార్షిక దినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగపూర్వక పోస్టు చేశారు. ఆ దాడిలో మరణించిన అమాయకులను ఎన్నటికీ మరిచిపోమని, వారిని స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు.

పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ.. జమ్మూకశ్మీర్‌లోని పెహల్గామ్‌లో సుమారు 26 మంది అమాయక పర్యాటకులను బలి తీసుకున్న విషయం తెలిసిందే. పెహల్గాం ఉగ్రవాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను స్మరిస్తున్నానని, గత ఏడాది ఇదే రోజున ఆ ఘటన జరిగిందని, వాళ్లను ఎప్పటికీ మరిచిపోలేమని ప్రధాని అన్నారు. దాడిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి తన సానుభూతి తెలిపారు. ఇలాంటి దుఃఖ సమయంలో దేశం మొత్తం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
