సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’ సినిమాపై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ తదితర ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని సమాచారం, సినిమా ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా రజనీకాంత్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండనుందని ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఈ సినిమా తెలుగు హక్కులు రూ.50 కోట్ల భారీ ధరకు అమ్ముడవడమే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రైట్స్‌ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఏషియన్ సునీల్ సొంతం చేసుకున్నారు.
ఇది రజనీ గత చిత్రం 2.0 తర్వాత తెలుగు మార్కెట్‌లో వచ్చిన అత్యధిక రేటు కావడం గమనార్హం. తమిళంలో కూడా ఈ సినిమాకి భారీ బిజినెస్ జరుగుతోందని టాక్. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌కి వస్తున్న స్పందన చూస్తుంటే, ‘కూలీ’ సినిమా విడుదల తరువాత ఎంత స్దాయిలో బ్లాక్‌బస్టర్ అవుతుందో చూడాలి.