Telangana | ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు

Telangana | ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు
పారదర్శకంగా డీలిమిటేషన్ : కిషన్‌రెడ్డి
Telangana | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : డీలిమిటేషన్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దేశంలోని ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, అత్యంత పారదర్శకమైన పద్ధతిలో ఈ ప్రక్రియను నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ అంశంపై కనీస అవగాహన లేదని, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఈ అంశంపై రాజకీయ లబ్ధి కోసం అనవసర విమర్శలు చేయవద్దని కిషన్ రెడ్డి హితవు పలికారు.
