HYD| మాగంటి గోపీనాథ్ కు త‌ల‌సాని నివాళి

హైద‌రాబాద్, జూన్ 18 (ఆంధ్ర‌ప్ర‌భ) : దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) కు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) నివాళులర్పించారు. ఇటీవల మాగంటి గోపీనాథ్ మరణించగా, బుధవారం జేఆర్సీ కన్వెన్షన్ (JRC Convention) లో ఆయన కుటుంబ సభ్యులు దశదిన కర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గోపీనాథ్ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a Reply