సౌందర్య లహరి

37. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమ జనకం
శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం
యయోఃకాన్త్యాయాన్త్యాశశికిరణ సారూప్య సరణే
విధూతాంతర్ధ్వాన్తా విలసతి చకోరీవ జగతీ

తాత్పర్యం: జగన్మాతా. నీకు చెందిన, అంటే, నీ నివాస స్థానమైన విశుద్ధి చక్రం లో ఆకాశోత్పత్తికి హేతువైన, దోషరహితమైన స్వచ్ఛతతో నిర్మలంగా ఉండే శివుణ్ణి, ఆ శివుడితో సమానమైన నిన్ను సేవించుకుంటున్నాను. మీనుండి ప్రసరిస్తున్న చంద్రకాంతులతో సాటి వచ్చే కాంతుల వల్ల మూడులోకాలుఆజ్ఞానాంధకారం నుండి తొలగి,ఆడుచకోరపక్షి లాగా ఆనందిస్తాయి.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply