బాధ్యుల‌ను శిక్షించాలి

బాధ్యుల‌ను శిక్షించాలి

రజకులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఊట్కూర్, ఫిబ్రవరి 22 (ఆంధ్రప్రభ) నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర మల్లన్న జాతరలో రజకులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా జోగితి వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ హాజమ్మ, అంబేద్కర్ సంఘం కార్యదర్శి కొండన్ భరత్, అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు రంగమొళ్ల దశరథ్ డిమాండ్ చేశారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో రజక కులస్తులపై అదే గ్రామానికి చెందిన గణేష్ చంద్రకళ మౌనిక టికెట్ లేకుండా ఆలయంలోకి ప్రవేశించారని సర్పంచ్ తుకారాం రెడ్డి, ఆయన వర్గీయులు సతీష్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మధు రెడ్డి వారిపై దాడి చేసి రెండు నెలల చిన్నారి కాళ్ళను చంపడం హేయ‌మైన చర్యగా అభివర్ణించారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టం అందరికీ సమానమేనని దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నరసింహులు, నాయకులుహన్మంతు, ,తిమ్మప్ప నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply