Sensex | మార్కెట్లకు భారీ షాక్..!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో అప్రమత్తత కనిపిస్తోంది.
ఈరోజు ఉదయం ప్రారంభ సమయానికి నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 24,491 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సెన్సెక్స్ 304 పాయింట్లు తగ్గి 78,228 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలను పరిశీలిస్తే.. అమెరికా డాలర్ సూచీ 99.75 వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 87.8 డాలర్లకు చేరింది. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.7 శాతానికి పెరిగింది.
గత సెషన్‌లో అమెరికా మార్కెట్లు కూడా స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. ఎస్‌అండ్‌పీ 0.06 శాతం, నాస్‌డాక్ 0.32 శాతం నష్టపోయాయి. ముడిచమురు ధరలు పెరగడం, అమెరికా బాండ్ ఈల్డ్‌లు అధిక స్థాయిలో ఉండటం వంటి అంశాలు దేశీయ మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నాయి.
